వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
KMM: తల్లాడ(మ) రామచంద్రపురంలో ఇవాళ విషాదం నెలకొంది. తీవ్రమైన ఎండల ధాటికి వడదెబ్బ తగిలి పులి సత్యనారాయణ అనే వ్యవసాయ కూలీ మృతి చెందారు. సత్యనారాయణ ఉదయం కూలీ పనులకు వెళ్లగా, ఎండ తీవ్రతకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ఇప్పటికే ఇవాళ గట్టుసింగారంనికి చౌడయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.