ఉపాధ్యాయ వృత్తి నుంచి సర్పంచ్‌గా విజయం
JGL: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో ద్యావన పెల్లి రామకృష్ణ ఉన్నత చదువులు చదివి, ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఇప్పుడు సర్పంచ్‌గా విజయం సాధించారు. గత ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా గెలిచి, తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 571 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వరుసగా వార్డు సభ్యుడిగా, సర్పంచ్‌గా గెలుపొందిన ఆయనను గ్రామస్తులు అభినందిస్తున్నారు.