‘హేట్ స్పీచ్ పేరుతో భయపెడుతున్నారు’

‘హేట్ స్పీచ్ పేరుతో భయపెడుతున్నారు’

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ డీజీపీని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులను బహిరంగంగా దూషించినా ఎలాంటి విచారణ జరపలేదని, ఇప్పుడు హేట్ స్పీచ్ చట్టం పేరుతో ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని చెప్పారు.