తుఫాన్ బాధితులకు నిత్యవసరాల పంపిణీ చేసిన MRO
ప్రకాశం: కనిగిరి మండలంలోని విశ్వనాధపురంలో తుఫాన్ బాధితులకు ఎమ్మార్వో జయలక్ష్మి 25 కేజీల బియ్యం,నిత్యవసర వస్తువులతోపాటు ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు నగదును శనివారం పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందిన ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో బాధితులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.