రేకుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

TPT: తిరుపతి జిల్లా తుంగపాలెంలోని రేకుల పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆదిత్య(25) అనే యువకుడు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.