ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

VSP: రామ్‌నగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యలపై వినతిపత్రాలు అందించగా, వాటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరిత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి రాంబిల్లి కార్యక్రమానికి బయలుదేరారు.