దాడి కేసులో నిందితుడు అరెస్ట్

దాడి కేసులో నిందితుడు అరెస్ట్

MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన దాసరి సతీష్ అదే గ్రామానికి చెందిన దాసరి నగేష్‌ను గత నెల 11న రాత్రి సమయంలో ఓ ఫంక్షన్ హాల్‌లో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన ఎస్సై చిర్ర రమేష్ బాబు పాత కక్షలను దృష్టి పెట్టుకుని కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. బాధితుడు నగేష్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.