అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన CDPO
NDL: మహానంది మండలం గాజులపల్లెలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆత్మకూరు సీడీపీఓ కోటేశ్వరమ్మ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, వంటగది, పిల్లలకు ప్రభుత్వం అందజేస్తున్న మెనూను ఆమె పరిశీలించారు. విద్యా బోధనపై పలు అంశాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.