క్వారీలో పడిన వ్యక్తి మృతదేహం లభ్యం

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా క్వారీ గుంతలో పడి, మృతి చెందిన గుర్తు తెలియని యువకుని మృతదేహం సోమవారం లభ్యమైంది. చనిపోయిన వ్యక్తి వయసు 30 నుంచి 40 సంవత్సరాలలోపు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.