'50 శాతం రాయితీతో పన్నులు చెల్లించే అవకాశం'
కోనసీమ: మున్సిపాలిటీ పరిధిలో చెల్లించాల్సిన ఇంటి పన్నులు, ఖాళీ స్థల పన్నుల బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయం కల్పించినట్లు మండపేట కమిషనర్ టీవీ రంగారావు మంగళవారం తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆదేశాల మేరకు ఈ రాయితీ అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. బకాయి పన్నులను ఒకేసారి చెల్లించే పన్ను దారులకు ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు.