రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయండి: టీపీటీఎఫ్
SDPT: ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో నిర్వహించే టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయాలని అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేటలో డీఈవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.