నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మించాలని వినతి
ATP: గుత్తిలో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మించాలని కోరుతూ ఇవాళ గుంతకల్లు అగ్నిమాపక అధికారి అశ్వర్ధకు వైసీపీ ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే మంజూరైన అగ్నిమాపక కేంద్రాన్ని అధికారులు చొరవ తీసుకుని త్వరలోనే నిర్మించాలన్నారు. వచ్చే సీజన్ ఎండకాలం కావడంతో త్వరగా పూర్తి చేయాలన్నారు.