వర్సిటీ వసతి గృహాల్లో చీఫ్ వార్డెన్ తనిఖీ
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని న్యూ పీజీ, పీజీ బాలుర వసతి గృహాలను చీఫ్ వార్డెన్ కృష్ణయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్‌లోని సరకులను పరిశీలించిన ఆయన.. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. మెరుగైన విద్యాభ్యాసానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు.