పదో తరగతి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య
ATP: కణేకల్లు మండలం నల్లంపల్లిలో టెన్త్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బస్సప్ప, రేణుకమ్మ దంపతుల కుమారుడు అరవింద్ చదువులో వెనుకబడి ఉండటం, పాఠశాలకు సక్రమంగా వెళ్లేవాడు కాదు. మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లి మందలిస్తుందని భయపడి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసారు.