వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై ఉచిత వైద్య శిబిరం

వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై ఉచిత వైద్య శిబిరం

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61వ డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీ వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లెపల్లి రాజేష్ ప్రారంభించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు రక్తం, మూత్రం, ఈసీజీ వంటి పరీక్షలను వైద్య నిపుణులు నిర్వహించారు. అనంతరం ఉచితంగా వాకర్స్‌కు మందులను పంపిణీ చేశారు.