మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన

మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన

MHBD: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కళాశాలల్లో షీటీం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సునంద విద్యార్థినిలకు భద్రతా చిట్కాలు తెలియజేసి, పలు అంశాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా షీటీంను సంప్రదించాలని సూచించారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై సూచనలు చేశారు.