'పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'
AKP: పంచాయతీ సిబ్బంది, అధికారులు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీపీవో సందీప్ సూచించారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన పాయకరావుపేట పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం అరట్లకోట, పాల్తేరు, ఈదటం తదితర గ్రామాల్లో పర్యటించి ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ నెలాఖరులోగా శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలన్నారు.