జిల్లా నూతన DEOగా రాజేంద్ర ప్రసాద్

జిల్లా నూతన DEOగా రాజేంద్ర ప్రసాద్

చిత్తూరు జిల్లా నూతన డీఈవోగా రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం బుక్కపట్నం డైట్ కాలేజీ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వారంలో డీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. ప్రస్తుత చిత్తూరు డీఈవో వరలక్ష్మిని కార్వేటినగరం డైట్ కాలేజీకి బదిలీ చేయనున్నారు.