రాధాకృష్ణన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా చేసిన సేవలను గుర్తుచేశారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడేలా సభ్యులు నడుచుకోవాలని, అర్ధవంతమైన చర్చలతో సభకు సార్థకత చేకూర్చాలని మోదీ సూచించారు.