విద్యుదాఘాతంతో ఐదు ఎద్దులు మృతి

విద్యుదాఘాతంతో ఐదు ఎద్దులు మృతి

ELR: వేలేరుపాడు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులకు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. ఆ తీగను తగలుకొని నాగులగూడెం వాసి వేల్పుల శీనుకు చెందిన ఐదు ఎద్దులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి.