మహాలక్ష్మీ పథకంతో మహిళలకు ఆర్థిక లాభాలు

మహాలక్ష్మీ పథకంతో మహిళలకు ఆర్థిక లాభాలు

HNK: పరకాల పట్టణంలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఆర్థికంగా మేలు చేస్తోందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈరోజు బస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ.10 వేల కోట్లకు పైగా ఆదా చేసుకున్నారని తెలిపారు. పరకాల డిపోలో 2.10 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ. 84.61 కోట్లను ఆదా చేసుకున్నట్లు పేర్కొన్నారు.