బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

MLG: ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్ మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.