ఇక నుంచి వారికి ఫ్రీ దర్శనం

ఇక నుంచి వారికి ఫ్రీ దర్శనం

కర్నూలు: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక తీర్మాణాలకు ఆమోదం తెలిపింది. ఇకనుంచి శ్రీశైలంలో నివసించే చెంచు గిరిజనులకు ప్రతి నెల చివరి వారంలో ఒకరోజు ఉచితంగా స్ఫర్శ దర్శనం కల్పించనున్నారు. అలాగే రూ. 500 టికెట్‌పై రెండు లడ్డూలు, రూ. 300 టికెట్‌పై ఒక లడ్డు భక్తులకు ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకుంది.