అట్రాసిటీ కేసులపై వేగవంత చర్యలు: కలెక్టర్
భద్రాద్రి జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. పరిహారం, పునరావాసం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇలాంటి ఘటనలు నివారించాలని తెలిపారు.