'నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'
PDPL: ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను కార్మిక వ్యతిరేకమని పేర్కొని వెంటనే రద్దు చేయాలన్నారు. రామగుండం–3 ఏరియాలో ఐఎఫ్‌టీయూ నాయకత్వంలో లేబర్ కోడ్ ఆర్డర్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. కార్మికుల హక్కులను దెబ్బతీసే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటానికి దిగాలని పిలుపునిచ్చారు.