'మోగ్లీ' స్పెషల్ షో.. వీక్షించిన బన్నీ
యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'మోగ్లీ' ఈనెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సెలబ్రిటీల కోసం గచ్చిబౌలిలోని AMB సినిమాస్‌లో ప్రత్యేక ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా టిక్కెట్లను రూ.99కే విక్రయిస్తున్నారు.