'ముందస్తు అరెస్టులకు భయపడేది లేదు'
BDK: రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి బిజెపి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చండ్రుగొండ మండల BJP నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అధ్యక్షుడు నల్లమోతు రఘుపతిరావు మాట్లాడుతూ.. ముట్టడికి బయలుదేరుతున్న నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ఇటువంటి నిర్బంధాలకు BJP నాయకులు సిద్ధంగా ఉన్నారని అక్రమ అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు.