నల్లబార్లీ సాగు చేస్తే చర్యలు తప్పవు: తహసీల్దార్
GNTR: పెదనందిపాడు(M) గోగులమూడిలో తహసీల్దార్ హేనాప్రియ రైతులకు కీలక హెచ్చరిక చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నల్లబార్లీ పొగాకు సాగు నిషిద్ధమని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీని పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు శెనగ, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు.