హనుమాన్ ఆలయం వద్ద ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

హనుమాన్ ఆలయం వద్ద ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

ASF: హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎండీ అహ్మద్ ఆలయ పరిసరాలను సందర్శించి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరపున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.