పాఠశాలలో మద్యం సీసాల కలకలం

పాఠశాలలో మద్యం సీసాల కలకలం

VKB: వికారాబాద్‌లోని ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల భవనంలో మద్యం సీసాలు లభ్యమవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విద్యార్థినులు ఉండే చోట అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది బయటి వ్యక్తుల పనా? లేక సిబ్బంది నిర్లక్ష్యమా? అన్నది తేలాల్సి ఉందని తల్లిదండ్రులు అంటూన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని సూచించారు.