VIDEO: విరబూసిన బ్రహ్మ కమలాలు

VIDEO: విరబూసిన బ్రహ్మ కమలాలు

ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఐటీడీఏ కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణరాజు ఇంటిలో బ్రహ్మ కమలాలు విరబూశాయి. శనివారం రాత్రి ఒకేసారి పలు బ్రహ్మ కమలాలు పూసి అబ్బురపరిచాయి. దీంతో పలువురు ఈ పూలను ఆసక్తిగా తిలకించారు. హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే ఈ పూల మొక్కల ఆకులే, పూలుగా రూపాంతరం చెందుతాయి. లక్ష్మీదేవికి చిహ్నంగా భావించే ఈ పూలకు పలువురు పూజలు చేస్తారు.