మిస్సింగ్.. ఈ పాప మీకు తెలుసా..?
తిరుమల లేపాక్షి సర్కిల్ దగ్గర 10 ఏళ్ల బాలిక ఒంటరిగా కనిపించగా భక్తుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం.. 'పాపకు మాటలు రావు. బాలిక పేరు, చిరునామా తెలియదు. తల్లిదండ్రులు ఎవరూ కనబడలేదు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ద్వారా తిరుపతిలోని PASS NGO సంస్థకు అప్పగించారు. ఆచూకీ తెలిసిన వారు 08772-289031, 94407-96772 నెంబర్లకు సంప్రదించాలి' అని కోరారు.