నర్సంపేటలో తొలిసారిగా కమలం గెలుపు
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూలూరి రోజా రాణి మనిష్ ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జూలూరి రోజా రాణి మనిష్ తొలి ప్రయత్నంలోనే విజయం నమోదు చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఫలితాలు వెలువడగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు.