గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

HYD: గోల్కొండ ఖిల్లా ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను STF అధికారులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన గంజాయిని స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు మెరుపు దాడులు  నిర్వహించారు. వారి నుంచి 2.03 కేజీల బరువున్న 308 గంజాయి ప్యాకెట్లతో పాటు 3 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.