స్కందమాత అలంకారంలో దర్శనమిస్తున్న చౌడేశ్వరి మాత

స్కందమాత అలంకారంలో దర్శనమిస్తున్న చౌడేశ్వరి మాత

NDL: మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరి మాత దసరా నవరాత్రులలో భాగంగా ఐదవరోజు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నల్ల కాలువ శ్రీనివాసులు రెడ్డి అర్చకుల ఆధ్వర్యంలో చౌడేశ్వరి మాతకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పుష్పాలంకరణలో నిమ్మకాయ దండలతో అలంకరించి మహా మంగళహారతి నిర్వహించారు.