16న యాదాద్రికి కేటీఆర్

BNR: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు రానున్నారు. ఈ నెల 16న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై దిశానిర్దేశం చేయనున్నారు.