'ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి'
CTR: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు తమ సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. సమస్యలు తప్పక పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.