VIDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు
KDP: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ కడప జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే స్వామివారికి అభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం ఆవరణమంతా భక్తుల నినాదాలతో మార్మోగింది. మహిళలు కార్తీక దీపాలు వెలిగించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని, కాయ కర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.