VIDEO: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
NLR: సీతారామపురం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామపురం టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ప్రధాన కార్యదర్శి సుమన్, సీతారామపురం యువత కన్వీనర్ పసుపులేటి వికాస్‌బాబు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది.