విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
NLG: మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ (38) రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద భవనంపై వేలాడుతున్న తీగలు ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బంధువులు సాగర్ హైవేపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.