హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి చలనం లేకుండా ఉన్నా 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు చికిత్స నిలిపివేయచ్చని వెల్లడించింది. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా తీర్పు ఇచ్చింది.