‘పెళ్లంటే అబ్బాయిలకే ఎక్కువ ఇంట్రెస్ట్’

‘పెళ్లంటే అబ్బాయిలకే ఎక్కువ ఇంట్రెస్ట్’

TG: అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన ఇటీవల ఐఐటీ HYD స్టూడెంట్స్‌తో సరదాగా మాట్లాడారు. తన అనుభవాన్ని SMలో పంచుకున్నారు. 'మీలో పెళ్లి చేసుకునేవారు ఎంతమంది?' అని తాను అడిగితే.. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ మంది చేయి ఎత్తారట. దీన్ని చూసి మహిళలు కెరీర్‌పై గట్టిగా ఫోకస్ పెడుతున్నారని, ఇది 'కొత్త-ప్రోగ్రెసివ్ ఇండియా'కు సంకేతమని ఉపాసన అన్నారు.