లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని వినతి

KKD: కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని CITU మండల కార్యదర్శి శ్రీనివాసు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ (సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో ఈ నెల 20న తుని మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారన్నారు. ఈ మేరకు మంగళవారం తుని కమిషనర్ వెంకట్‌రావుకు సమ్మె నోటీస్ అందజేశారు.