'అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు'

VZM: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి పట్టణంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అరకొర నిధులు మంజూరు చేసి మభ్య పెడుతున్నారని పేర్కొన్నారు.