తణుకు ఎమ్మెల్యేతో మందలపు రవి భేటీ

W.G: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ మందలపు రవి ఆదివారం భేటీ అయ్యారు. తణుకులోని ఎమ్మెల్యే రాధాకృష్ణ నివాసానికి విచ్చేసిన మందలపు రవి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. కొద్దిసేపు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మందలపు రవిని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు.