జిల్లా కేంద్ర కొనసాగింపుకు కృతజ్ఞత సభ ఏర్పాట్లు

జిల్లా కేంద్ర కొనసాగింపుకు కృతజ్ఞత సభ ఏర్పాట్లు

అన్నమయ్య: రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించినందుకు కృతజ్ఞత, అభినందన సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 4న జరగనున్న సభ పనులను TDP నేత మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రజాభిలాష మేరకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచిన ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని నాయకులు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.