'నేరాలకు పాల్పడితే బహిష్కరణ తప్పదు'

'నేరాలకు పాల్పడితే బహిష్కరణ తప్పదు'

ELR: సత్ప్రవర్తనతో మెలగకుండా నేరాలకు పాల్పడితే బహిష్కరణ తప్పదని ఏలూరు రూరల్ SI నాగబాబు హెచ్చరించారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ఆయన రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లను ఎత్తివేసేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు కూడా చేస్తామన్నారు.