'ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు'
VZM: గరివిడి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ చీపురుపల్లి, గరివిడి మండలాల ముఖ్య నాయకులతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. అలాగే, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.