VIDEO: ధర్మవరంలో ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన
సత్యసాయి: ధర్మవరంలో అటల్ బిహారి వాజ్ పాయ్ విగ్రహావిష్కరణ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో బ్రాహ్మణ వీధికి చెందిన 12 మంది బాల కళాకారులు గురువారం నాట్య ప్రదర్శన చేశారు. వినాయక స్తుతి, రంగ పూజ, శ్రీకృష్ణ లీలలు, గరుడ గమన, కుంభజ్యోతి నాట్యం వంటి నాట్య ప్రదర్శన చూపరులను ఎంతగాగానో ఆకట్టుకుంది. మంత్రి సత్యకుమార్ బాల కళాకారులను అభినందించారు.