ఇవాళ స్పీకర్ విచారణకు పోచారం, అరెకపూడి
TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. నిన్న తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను విచారించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరెకపూడి గాంధీని విచారించనున్నారు. ఈ మేరకు వారిపై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.